విశ్వనరుడు
విశ్వనరుడు నేడు ప్రపంచం ఎన్నో విధాలుగా విడిపోయి ఉంది . కులం, మతం , భాష, లింగం, వర్ణం మరియు ప్రాంతం ప్రాతిపదికన ఎన్నో విధాలుగా విడిపోయివుంది . మనుషుల మధ్య వైషమ్యాలు ఎన్నో విధాలుగా పెరిగిపోయాయి . ఈ తారతమ్యాలు, భేదభావాలు లేనివాడే విశ్వనరుడు . విశ్వనరుడు ఈ ప్రపంచం మొత్తాన్ని తన కుటుంబంలా భావిస్తాడు . సాటి మనుషుల్ని ప్రేమిస్తాడు. పరుల కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడు . నిస్స్వార్థంతో పరులకై పాటు పడతాడు. ఏమి ఆశించి స్వామి వివేకానంద పాశ్చాత్యులకు సైతం వేదాంత సారాన్ని భోదిస్తాడు. ఏమి ఆశించి చేగువేరా తన దేశం కాని దేశాల దాస్య విముక్తికై పోరాడతాడు. ఇంకా ఎందరో ప్రపంచ చరిత్రలో మనుషులుగా పుట్టి విశ్వనరులుగా ఎదిగారు. చికాగో సర్వమత మహాసభల్లో వివేకానందుడు '' నా ప్రియమైన అమెరికా సోదర సోదరీమణుల్లారా అని సంబోధిస్తాడు." ఆ పిలుపుకు అమెరికాతో పాటు మిగిలిన దేశాల వారు సైతం ఆశర్యపోతారు. మ...